పార్లమెంటు శీతాకాల సమావేశాలు పొడిగించే అవకాశం
ఈ రోజు ప్రారంభమైన పార్లమెంటు శీతాకాల సమావేశాలను పొడిగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పార్లమెంటు తొలి రోజు ఆరంభంలోనే వాయిదా పడడంతో అధికార, ప్రతిపక్ష పార్టీలన్నీ వ్యూహప్రతివ్యూహాల్లో మునిగిపోయాయి. కాగా తెలంగాణ బిల్లు ఆమోదం, పలు సమస్యలపై చర్చించేందుకు సమయం సరిపోయే అవకాశం లేనందున, శీతాకాల సమావేశాలను పొడిగించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం.